Sara Ali Khan | స్టార్డమ్ ఉన్న వారు సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో, ఆటోల్లో ప్రయాణించడం అరుదుగా చూస్తుంటాం. వారు ఎక్కువగా లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని సార్లు సాధారణ ప్రజల్లా లోకల్ వాహనాల్లో ప్రయాణిస్తారు. ఇటీవల కొందరు సెలబ్రిటీలు సైతం ప్రజా రవాణాల్లో ప్రయాణం చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. తాజాగా బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా, ట్రైన్ దిగిన అనంతరం కూడా సారా ఆటోలో ప్రయాణం కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది.