NBK 109 | తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు వరుస సినిమాలు రెడీ అవుతున్నాయని తెలిసిందే. వీటిలో బాబీ (Bobby) డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తోన్న ఎన్బీకే 109 (NBK109) ఒకటి. మరోవైపు వెంకీ-అనిల్ రావిపూడి సినిమా కూడా సెట్స్‌పై ఉంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగబోతున్నాయా..? అంటే నెట్టింట చక్కర్లు కొడుతున్న కథనాలు అవుననే చెబుతున్నాయి.
తాజా టాక్ ప్రకారం ఎన్బీకే 109, వెంకీ సినిమాలు సంక్రాంతి బరిలో నిలువబోతున్నాయట. ఎన్బీకే 109 జనవరి 12, వెంకీ మూవీ జనవరి 14న రాబోతున్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఈ అప్డేట్స్పై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.
దసరా కానుకగా ఎన్బీకే 109 టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని వార్తలు వస్తుండగా.. మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఎన్బీకే 109 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి, దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also :
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!