Sanjay Leela Bhansali | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali). ఇక వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల జాబితాలో ముందువరుసలో ఉంటుంది అలియాభట్ (Alia Bhatt). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన గంగూభాయ్ కథియావాడి (Gangubai Kathiawadi) ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా అవార్డులు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
ఈ స్టార్ డైరెక్టర్ టాప్ హిందీ పోర్టల్‌తో చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. నేను అలియాభట్‌తో ఇన్షా అల్లా చేస్తున్నా. అప్పుడే అనుకోకుండా ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో ఆమె కోపంతో ఆగ్రహావేశంతో ఊగిపోయింది. గదిలో తనను తాను బంధించుకొని ఏడ్చేసింది. వారం తర్వాత అలియాభట్‌ను పిలిచి.. నువ్వు గంగూభాయ్ పాత్రలో నటించబోతున్నావ్ అని చెప్పానన్నాడు.
లాస్ ఏంజిల్స్‌లో (ఇన్షా అల్లా పాత్ర) పోషిస్తున్న పాత్ర నుండి నేను కామాటిపురకి వచ్చాను. ఈ పాత్ర నాకు తెలియదు. దీన్ని నేను ఎలా చేయాలి ? అని అడిగింది. అప్పడు నేను స్పందిస్తూ.. నీకు నా మీద నమ్మకం ఉందా..? నీకు నేను తెలుసా ? ఆ ఉక్కు మహిళను నీలో చూశా. నేను నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నా. నువ్వు ఆ పాత్రను మీ దృష్టికోణంతో ఎలా మెప్పించగలవో తెలుసునని చెప్పానన్నాడు భన్సాలీ.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున