Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రాజాసాబ్ (Raja Saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ మారుతి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ప్రభాస్ గ్లామరస్ రోల్లో హార్రర్ కామిక్ టైమింగ్‌తో అదరగొట్టబోతున్నట్టు తాజా గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ అంటూ విడుదల చేసిన మేకింగ్ విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న సీన్లు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Nothing but KING-SIZED entertainment ahead 🔥
Happy Birthday Director Saab @DirectorMaruthi ❤️
and Darlings….Ending is just for you! 😉#TheRajaSaab #TheRajaSaabOnApril10th pic.twitter.com/1A4le64jf5
— The RajaSaab (@rajasaabmovie) October 8, 2024
Read Also :
Akkineni Nagarjuna | నాంపల్లి కోర్టుకు నాగార్జున ఫ్యామిలీ.. ఎవరెవరు వచ్చారంటే..?
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
NTRNeel | ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే.?