Naga Chaitanya | టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందూమొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైతూకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. కలర్ ఫొటో ఫేం సుహాస్ (Suhas ) నటిస్తున్న తాజా చిత్రం జనక అయితే గనక (Janaka Aithe Ganaka).
డెబ్యూ డైరెక్టర్ సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయం చెప్పాడు సందీప్ బండ్ల. ఈ చిత్రంలో ముందుగా నాగచైతన్యను అనుకున్నట్టు చెప్పాడు. కొన్ని నెలల పాటు నాగచైతన్యతో ప్రయాణం చేశా. అతడు శేఖర్ కమ్ములతో లవ్‌స్టోరీతో బిజీగా ఉండటం వల్ల నా సినిమా చేయలేకపోయాడు.
అదే సమయంలో దిల్ రాజు ఈ చిత్రాని సుహాస్ పేరు సూచించారు. అలా సుహాస్ చేతికి సినిమా వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అక్కినేని హీరో చేయాల్సిన స్క్రిప్ట్ ఫైనల్‌గా సుహాస్ చేతికి వచ్చిందన్నమాట. సంగీతర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, హర్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. బేబి ఫేం విజయ్ బల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున