SSMB 29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). ఈ సినిమా అప్డేట్స్ గురించి తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) నుంచి గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది.
ఎస్ఎస్ఎంబీ 29 చిత్రీకరణ 2025 జనవరిలో మొదలు కానుంది. ఈ విషయాన్ని పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇంకేంటి మరి మహేశ్ బాబు నయా అవతార్‌లో సెట్స్‌పైకి ఎంట్రీ ఇవ్వాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.
ఈ సినిమా కోసం ఇప్పటికే మహేశ్ బాబు మేకోవర్ పూర్తి చేసుకున్నాడని తెలిసిందే. మహేశ్‌బాబు లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. ఈ ఫొటోలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29ను 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
#SSMB29 Filming Begins in January 2025. pic.twitter.com/4FyV3AAx7w
— Nishit Shaw (@NishitShawHere) October 9, 2024
#SSMB29 – Shoot Starts From January 2025🔥🔥🔥
– #VijayendraPrasad #MaheshBabu𓃵 @urstrulyMahesh pic.twitter.com/dRgqfmHVm1
— South Digital Media (@SDM_official1) October 9, 2024
Read Also :
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!