Prabhas | బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తారు. ఇంతకీ స్టార్ యాక్టర్ ఎప్పుడు పెండ్లి (wedding) పీటలెక్కబోతున్నాడన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది.
త్వరలోనే వెడ్డింగ్ అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నా.. దీనిపై అధికారికంగా క్లారిటీ రావడం లేదు. అయితే తమ ఫేవరేట్ హీరో ఎప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న దానిపై ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Syamala Devi) ఇటీవలే విజయవాడలోని ఐకానిక్ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. పెండ్లిపై నెలకొన్న ట్విస్ట్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తన్ను ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉంటుంని చెప్పింది శ్యామలా దేవి. అయితే ఇంతకీ ఎవరా అమ్మాయనేది మాత్రం చెప్పలేదు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇవే కాకుండా స్పిరిట్, కన్నప్ప, ఫౌజీ చిత్రాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. మరి ప్రభాస్ నుంచి పెండ్లి ప్రకటన ఎప్పుడుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున