Varuntej Ghani Non-theatrical Rights | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు విభిన్న కథలు ఎంచుకునే నటుడిగా టాలీవుడ్లో మంచి పేరు ఉంది. ప్రతి సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ జోనర్లో ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘గని’ విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నమొదు చేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డిజిటల్, శాటిలైట్, ఆడియో ఇలా అన్ని హక్కులు కలుపుకొని దాదాపు 25కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. విడుదలకు మందే ఒక యవ హీరోకు ఇంత మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే విశేషం అనే చెప్పాలి. అల్లఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర, నదియా కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.
Read Also:
Ajith Kumar | మధురై విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో అజిత్ నెక్స్ట్ చిత్రం?
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?