Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
సినీరంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. కొందరు నటీమణులకు ఎన్ని సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ లేదా రెండు సినిమాలతో రావలిసిన
Krithi Shetty Remuneration | సినీరంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. కొందరు నటీమణులకు ఎన్ని సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ లేదా రెండు సినిమాలతో రావలిసిన దానికంటే ఎక్కువే గుర్తింపు వస్తుంది. ఈ విషయంలో కృతి శెట్టి నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది. ఈమె పట్టిందల్లా బంగారమే. ‘ఉప్పెన’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును సాధించింది. ఉప్పెన విజయంలో సగంవరకు క్రెడిట్ కృతికే దక్కుతుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేసింది. ఆ తరువాత వరుసగా ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె టైర్2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
కృతిశెట్టి లేటెస్ట్గా బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కృతి భారీగా డిమాండ్ చేసిందని సమాచారం. కృతి ఇప్పటివరకు ప్రతి సినిమాకు కోటీ రూపాయల వరకు పారితోషికాన్ని తీసుకుందట. కాగా సూర్య-బాల కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు 50లక్షల పారితోషికాన్ని పెంచి కోటిన్నర డిమాండ్ చేసిందని కోలీవుడ్ వర్గాల సమాచారం . అయితే మేకర్స్ కూడా ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కృతి అడిగినంత పారితోషికాన్ని ఇచ్చారట. 18 ఏళ్ళ తర్వాత బాల- సూర్య కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 2D ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక,సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also:
Krithi Shetty | చిరునవ్వుతో చంపేస్తున్న కృతి శెట్టి..
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Kaathuvaakula Rendu Kaadhal | షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కాతువాకుల రెండు కాదల్’.. విడుదల ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

