This Week Releasing Movies | గత శుక్రవారం థియేటర్లు ‘ఆర్ఆర్ఆర్’తో నిండిపోయాయి. ఏ థియేటర్లో చూసిన ట్రిపుల్ఆర్ బొమ్మే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక అదే రోజున ఓటీటీలో విడుదలైన ‘వలిమై’ జీ-5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను సాధించింది. ఈ క్రమంలో ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలేంటో ఒక సారి చూద్ధాం.
మిషన్ ఇంపాజిబుల్:
రొటీన్‌కు భిన్నంగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది తాప్సీ. ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ ఫేం సంజయ్ స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నిజ జీవిత కథను ఆధారంగా చేసుకొని సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్1న ప్రేక్షకుల మందుకు రానుంది.
ఎటాక్:
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించింన చిత్రం ‘ఎటాక్’. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం మొదటి భాగం కరోణా కారణంతో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది. సై ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్ అసాధారణ శక్తులున్ని ఇండియన్ ఆర్మీ సూపర్ హీరోగా నటించాడు.
మోర్బియస్:
జారెడ్ లెటో, మాట్ట్ స్మిత్, జారెడ్ హర్రిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోర్బియస్’. మార్వెల్ కామిక్స్‌ను బేస్ చేసుకొని డానియల్ ఎస్పినొస ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సూపర్ హీరో ఫాంటసీలో ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, మార్వెల్ ఎంటర్టైనమెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. యాక్షన్ అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
ఓటీటీ:-
రాధేశ్యామ్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి11న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రభాస్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఏప్రిల్ 1 నుంచి ‘అమేజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ కానుంది.
ఆడవాళ్ళు మీకు జోహార్లు:
యువ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. వరుస ఫ్లాప్‌లలో ఉన్న శర్వాకి ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇస్తుందని అందరూ భావించాడు. కానీ ఈ చిత్రం కూడా శర్వానంద్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్2 నుంచి ‘సోని లివ్’లో స్ట్రీమింగ్ కానుంది.
హే సినామిక:
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరి హీరోయన్లుగా నటించిన చిత్రం ‘హే సినామిక’. కామెడీ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి బృందా దర్శకత్వం వహించింది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కనీస స్థాయిలో కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం మార్చి 31నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’తో పాటు ‘జియో సినిమా’లోను స్ట్రీమింగ్ కానుంది.
జూన్:
మలయాళంలో 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జూన్’. రాజియా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అహ్మద్ ఖబీర్ దర్శకత్వం వహించాడు. ఒక అమ్మాయి లైఫ్ ఇంటర్, డిగ్రీ, జాబ్ ఇలా మూడు దశలలో జరిగే లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఏప్రిల్ 1నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రవీణ్ తాంబె ఎవరు?:
రాహుల్ ద్రావిడ్ ‘రాజస్థాన్ రాయల్స్’ కోచ్‌గా ఉన్నప్పుడు ఒక మీడియా ప్రతినిధి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్రికెటర్ ఎవరు అని అడిగితే రాహుల్ దానికి రిటైర్మెంట్ అయ్యే ఏజ్‌లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఆటగాడు ప్రవీన్ తాంబే తనకు ఇన్సిరేషన్ అని చెప్పాడు. ఇప్పడు అదే ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కున్న చిత్రం ‘ప్రవీణ్ తాంబే ఎవరు?’. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ‘డిస్నీ హాట్‌స్టార్’లో ఏప్రిల్ 1న హిందీతో పాటు లెలుగు, తమిళ భాషల్లో విడదల కానుంది. ప్రవీన్ తాంబే 41ఏళ్ళకు రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీన్ తాంబే.