Kaathuvaakula Rendu Kaadhal | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ మైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే నిడివి ఎంతుంది అని ఆలోచించకుండా ఆ పాత్రకు ఎంత వరకు న్యాయం చేయగలను అని ఆలోచించే అతికొద్ది మంది నటులలో విజయ్ సేతుపతి ఒకడు. తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతూనే కీలకపాత్రలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈయన లెటెస్ట్‌గా నటించిన చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించాడు.
ఈ చిత్రం లేటేస్ట్‌గా షూటింగ్ పూర్తీ చేసుకుంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ‘సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానున్నట్లు’ సమంత పేర్కొంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రౌడి పిక్చర్స్, సెవన్ స్క్రీన్ బ్యానర్లపై లలిత్ కుమార్‌తో కలిసి నయనతార, విఘ్నేష్ శివన్‌లు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.
Read Also:
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్