Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్‌ను
Radhe Shyam Final Collections | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్‌ను తెరపై చూడబోతున్నాం అనే ఉత్సాహంతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ కమర్షియల్ స్టోరి కాకుండా ఒక లవ్ స్టోరి కథలో నటించినందుకు ప్రభాస్ గట్స్‌కు మెచ్చుకోవాలంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు బాగానే ఉన్న వీక్ డేస్‌లో మాత్రం భారీగా డ్రాప్స్ కనిపించాయి. దానికి తోడు పరభాష చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈ చిత్రానికి గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే
నైజాం : 24.80 కోట్లు
సీడెడ్ : 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.90 కోట్లు
ఈస్ట్ : 4.34 కోట్లు
వెస్ట్ : 3.32 కోట్లు
గుంటూరు : 4.50 కోట్లు
కృష్ణ : 2.71 కోట్లు
నెల్లూరు : 2.14 కోట్లు
ఏపీ+తెలంగాణ : 54.17 కోట్లు (84.60కోట్ల గ్రాస్)
తమిళనాడు : 0.76 కోట్లు
కేరళ : 0.18 కోట్లు
కర్ణాటక : 4.20 కోట్లు
హిందీ : 10.70 కోట్లు
ఓవర్సీస్ : 11.42 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 83.12 కోట్లు (151కోట్ల గ్రాస్)
రాధేశ్యామ్ చిత్రానికి రూ. 208 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.83.12 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ఫుల్‌రన్ ముగిసే సరికి ఈ చిత్రం 126 కోట్ల వరకు చిత్రం కొన్న బయ్యర్స్ నష్టాలపాలయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఇక ‘సలార్’ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Read Also:
Rangasthalam | నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’.. ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే?
RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Adipurush | ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడేనట?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

