RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
ప్రస్తుతం ఐపిఎల్‌కు మించిన హవా ఏదైనా ఉందంటే అది 'ఆర్ఆర్ఆర్' అనే చెప్పచ్చు.ఐపీఎల్‌ను హైలైట్స్లోనైనా చూసుకోవచ్చు.. కానీ ఆర్ఆర్ఆర్ను మాత్రం థియేటర్లో ఉన్నప్పుడే చూసేయాలి అని చాలా వరకు ప్రేక్షకులు భావిస్తున్నారు.
RRR Collections | ప్రస్తుతం ఐపిఎల్‌కు మించిన హవా ఏదైనా ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పచ్చు.ఐపీఎల్‌ను హైలైట్స్లోనైనా చూసుకోవచ్చు.. కానీ ఆర్ఆర్ఆర్ను మాత్రం థియేటర్లో ఉన్నప్పుడే చూసేయాలి అని చాలా వరకు ప్రేక్షకులు భావిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. చరణ్, తారక్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా హిందీలో ఈ చిత్రం 100కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి బాలీవుడ్ విశ్లేషకులను సైతం ఔరా అనిపించేలా చేస్తుంది.
‘ఆర్ఆర్ఆర్’ బృందం మొదటి నుంచే నార్త్‌లో గ్రాండ్‌గా ప్రమోషన్లను చేసింది. ఈ క్రమంలో హిందీలో ట్రిపుల్ఆర్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి రోజు నుంచి నార్త్‌లో కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం జోరు తగ్గడంలేదు. 5వ రోజ కూడా ఈ చిత్రం రూ.15.40 కోట్ల కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో 100కోట్ల మార్కును అందుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 100కోట్ల నెట్ షేర్‌ను సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. ఇక తాజాగా అమెరికాలో 10మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి బ్రేక్ఈవెన్న పూర్తీ చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 600కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డుల వేట కొనసాగిస్తుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, తారక్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. దానయ్య డివివి ఈ చిత్రాన్ని 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన సినీప్రముఖులు సినిమా గొప్పతనంపై, సాంకేతిక బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
#RRR #Hindi RRRoars and scores on the crucial make-or-break Mon… BIGGEST Day 4 [post pandemic]… FANTASTIC HOLD everywhere, especially in mass circuits… Will cross 💯 cr today [Tue; Day 5]… Fri 19 cr, Sat 24 cr, Sun 31.50 cr, Mon 17 cr. Total: ₹ 91.50 cr. #India biz. pic.twitter.com/Kne7GPi759
— taran adarsh (@taran_adarsh) March 29, 2022
Read Also:
Stand Up Rahul | ఓటీటీలోకి ‘స్టాండప్ రాహుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Salman Khan | బాలీవుడ్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్
Rashmika Mandanna | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. రష్మిక మందన్న?
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

