Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
విభిన్న కథలను ఎంచుకుంటూ తన నాచ్యురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అకట్టుకుంటాడు నాని. ఏడాదికి రెండు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం 'దసరా'.
Dasara Movie Non-Theatrical Rights | విభిన్న కథలను ఎంచుకుంటూ తన నాచ్యురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అకట్టుకుంటాడు నాని. ఏడాదికి రెండు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం ‘దసరా’. రొటీన్‌కు భిన్నంగా నాని ఈ సారి పూర్తీ మాస్ సినిమాతో రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలను నమోదు చేశాయి. అయితే ఈ క్రమంలో దసరా చిత్రానికి భారీగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ రూ. 45కోట్లకు విక్రయించిందట. నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్ నాన్ థియేట్రికల్ హక్కులు 35కోట్లకు అమ్ముడయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే గ్లోబల్‌గా నాన్- ఇంగ్లీష్ మూవీస్‌లో అత్యధిక వ్యూవర్ షిప్‌ను సాధించిన మూడవ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంతో నాని క్రేజ్ కూడా మరింత పెరిగింది. దాంతో దసరా చిత్రానికి ఇంత భారీ మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగందని టాక్. ఈ చిత్రంలో నాని సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని, కీర్తీ డీ గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన ‘అంటే సుందరానికి’ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది.
Read Also:
Prabhas | ఆ స్టార్ హీరోయిన్ మరోసారి ప్రభాస్‌తో కలిసి నటించనుందా?
Ram Gopal Varma | రాజమౌళిపై రామ్‌గోపాల్ వర్మ సంచలన కామెంట్స్.. వైరల్ అవుతున్న వాయిస్ లెటర్
Varun Tej | సిద్ధూ జోన్నలగడ్డ దర్శకుడితో.. వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
Oscar Awards | అంగరంగ వైభవంగా ‘ఆస్కార్’ వేడుకలు.. ఒకే సినిమాకు ఆరు అవార్డులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

