Varun Tej | సిద్ధూ జోన్నలగడ్డ దర్శకుడితో.. వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
విభిన్న కథలను ఎంచుకోవడంలో వరుణ్‌తేజ్ ముందు వరుసలో ఉంటాడు. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వరుణ్ తన కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్న కథలను
Varun Tej New Movie | విభిన్న కథలను ఎంచుకోవడంలో వరుణ్‌తేజ్ ముందు వరుసలో ఉంటాడు. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వరుణ్ తన కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాకు నటనను మెరుగు పరుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. కాగా ఇటీవలే ‘గని’ చిత్రాన్ని పూర్తి చేసిన వరుణ్ తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘గుంటూరు టాకీస్’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లాంఛనింగ్ కార్యక్రమంలో నాగబాబు క్లాపింగ్ కొట్టగా వరుణ్ తల్లి పద్మ కొణిదెల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రంలోని నటినటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే ప్రకటన రానుంది.
వరుణ్ నటించిన గని చిత్రం ఏప్రిల్ 8న విడుదలకానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అల్లుఅరవింద్ సమర్పణలో అల్లూబాబీ, సిద్ధూముద్ద నిర్మించారు. సాయిమంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇక ప్రవీన్ సత్తారు ప్రస్తుతం నాగార్జునతో ది ఘోస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

