Rashmika Mandanna | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. రష్మిక మందన్న?
సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న.
Rashmika Mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప-2’లో నటిస్తుంది. ఇక హీందీలో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్మిక తాజాగా హిందీలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
‘శివ’ తర్వాత టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. హిందీలో సందీప్‌రెడ్డి ఇదే సినిమాను షాహిద్ కపూర్‌తో తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్‌ను సాధించాడు. ప్రస్తుతం ఈయన రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడిగా రష్మిక మందన్న నటించనుంది. గత కొన్ని రోజుల నుంచి రష్మిక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ అవన్ని అవాస్తవమిని.. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించనున్నట్లు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టనుంది.
Read Also:
Naga Chaitanya | సమంత దర్శకురాలితో.. నాగచైతన్య నెక్ట్స్ సినిమా?
KGF Chpater-2 | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘కేజీఎఫ్-2’?
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
N.T.R | రామ్‌చరణ్ లేకపోతే ‘ఆర్ఆర్ఆర్’ లేదు :జూనియర్ ఎన్టీఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

