N.T.R | రామ్‌చరణ్ లేకపోతే ‘ఆర్ఆర్ఆర్’ లేదు :జూనియర్ ఎన్టీఆర్
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ హవానే కొనసాగుతుంది. ఏ థియేటర్‌కు వెళ్ళినా ట్రిపుల్ఆర్ బొమ్మే. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. ‘బాహుబలి’ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత రాజమౌళి
N.T.R | దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ హవానే కొనసాగుతుంది. ఏ థియేటర్‌కు వెళ్ళినా ట్రిపుల్ఆర్ బొమ్మే. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. ‘బాహుబలి’ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్తున్నారు. తారక్, చరణ్‌ల అభిమానుల నాలుగేళ్ళ నిరీక్షణకు తెరవేస్తూ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చరణ్, తారక్‌ల నటనకు విమర్శకుల సైతం జేజేలు కొడుతున్నారు. రాజమౌళి టేకింగ్, విజన్‌కు ప్రేక్షకులు, సినీప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. పలువురు సినీప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి నటినటులు, సాంకేతిక నిపులణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, నటులు అల్లుఅర్జున్, మహేష్‌బాబు దర్శకులు శంకర్, ప్రశాంత్ నీల్, సుకుమార్, రామ్ గోపాల్ వర్మలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా జూ. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ పై స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.
తారక్ విడుదల చేసిన లేఖలో ‘నా కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా ఆర్ఆర్ఆర్ను నిలిచిపోయే విధంగా చేసిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. నాలోని బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపిపించిన జక్కన్నకు ధన్యవాదాలు. చరణ్ నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్ను ఊహించలేను. నువ్వు లేకపోతే ఆర్ఆర్ఆర్ లేదు
అల్లూరి పాత్రకు నువ్వు సంపూర్ణ న్యాయం చేసావు. అల్లూరి పాత్రలేకపోతే భీమ్ పాత్ర అసంపూర్ణంగా ఉండేది. అజయ్ సర్‌తో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోసారు అంటూ ఈ చిత్రంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేశాడు. అంతే కాకుండా భారతీయ సినిమా ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉందని, ఆర్ఆర్ఆర్ చిత్రం కేవలం భారతదేశంలోని అతి పెద్ద యాక్షన్ డ్రామా చిత్రం కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద యాక్షన్ డ్రామా చిత్రం’ అని లేఖలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించగా. తారక్ భీమ్ పాత్రలో నటించాడు.
Read Also:
S.S.Rajamouli | రాజమౌళి సినిమాలు ఎందుకంత స్పెషల్‌గా ఉంటాయి!
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Prabhas | ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఆ పాత్రలో నటించనున్నాడా?
Kamal Haasan | గ్రామీణ నేపథ్యంలో కమల్‌హాసన్ తదుపరి సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

