Kamal Haasan | గ్రామీణ నేపథ్యంలో కమల్‌హాసన్ తదుపరి సినిమా?
విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటాడు.
Kamal Haasan | విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటాడు. ఏడాదికో సినిమా చేసుకుంటూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలు విభాగాల్లో పనిచేస్తూ తీరక లేకుండా గడుపుతుంటాడు.లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం ‘ఇండియన్-2’ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇండియన్-2 షూటింగ్ 30శాతం పూర్తైంది. పలు కారణాల వల్ల ఆగిపోయిన ఈ చిత్రం మళ్ళీ షూటింగ్‌కు సిద్ధం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు చిత్రాన్నిపూర్తి చేసి ద్వితీయార్థంలో ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదిలా ఉంటే కమల్ మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడని తెలుస్తుంది. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ప్రాజెక్ట్ ఉండనుందని సమాచారం. కమల్ గతకొంత కాలంగా టెక్నికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరమౌతున్నాడు. ఈ క్రమంలోనే మళ్ళీ ఫ్యామిలీ ఆడియోన్స్‌కు దగ్గరవ్వాలనే థోరణిలో గ్రామీణ నేపథ్యంలో జరిగే సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించనున్నాడు. ఈయన విశాల్ నటించిన ‘రాయుడు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కార్తీతో ‘విరుమన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
Jani Master | జానీ మాస్టర్‌కు కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో?
RRR Collections | బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ విధ్వంసం.. ‘బాహుబలి’ రికార్డులు అవుట్
Karan Johar | ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న కరణ్‌జోహర్?
Vikram Movie | కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో.. బిగ్ బీ అమితాబ్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kamalhaasan
- kollywood
- muttaiah
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

