RRR Collections | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ హవానే కనిపిస్తుంది. ఏ థియేటర్‌కు వెళ్ళిన ట్రిపుల్ఆర్ బొమ్మే. తారక్, చరణ్ అభిమానుల ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడి శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల నుంచి సినీప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, తారక్‌ల నటన వర్ణనాతీతం. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సినిమా మొత్తాన్ని వాళ్ళ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. రాజమౌళి టేకింగ్, విజన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మాస్టర్ మైండ్ ఆఫ్ ఇండియాన్ సినిమా అని రాజమౌళిని ఎందుకంటారో మరో సారి ట్రిపుల్ఆర్ తో నిరూపించాడు. చిత్రం విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ సేల్స్ ఓ రేంజ్లో జరిగాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం ఐదేళ్ళ బాహుబలి రికార్డులను చెదరగొట్టేసింది.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలో బాహుబలి పేరిట ఉన్న రికార్డులను చెరిపివేసింది. అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు తొలిరోజు కలెక్షన్లు కలిపి 5 మిలియన్ డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. గతంలో బాహుబలి 4.59 మిలియన్ డాలర్ల కలెక్షన్లను ట్రిపుల్ఆర్ సునాయసంగా అధిగమించింది. ఇక నైజాంలో 23.35 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి..’భీమ్లానాయక్’ పేరిట ఉన్న ప్రీవియస్ ఫస్ట్‌డే కలెక్షన్లను డబుల్ మార్జిన్‌తో కొల్లగొట్టింది. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 74కోట్ల షేర్ కలెక్షన్లన సాధించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ టు నార్త్ ప్రతి ఏరియాలో ట్రిపుల్ఆర్ విధ్వంసం సృష్టిస్తుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, తారక్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు.
ఇవి కూడా చదవండి:
Vikram Movie | కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో.. బిగ్ బీ అమితాబ్?
Rana Daggubati | ‘విరాట పర్వం’ విడుదలపై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?
Karan Johar | ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న కరణ్‌జోహర్?
Prabhas | ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఆ పాత్రలో నటించనున్నాడా?