Vikram Movie | యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ట్రెండ్‌కు తగ్గట్టు సినిమాలను చేస్తుంటాడు. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా పలు విభాగాల్లో పనిచేస్తూ బిజీగా గడుపుతుంటాడు. ‘విశ్వరూపం-2’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ గ్లింప్స్ సినిమాపైన అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటివలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అథితి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ చిత్రంలోని కీలక సన్నివేశంలో బిగ్‌బీ కనిపిస్తాడని సమాచారం. ఈయన పాత్ర చిత్రం ద్వితీయార్థంలో రానుందట. కమల్ హాసన్ కోరిక మేరకే బిగ్‌బీ ఈ చిత్రంలో నటించాడని టాక్. దీనిపై అధికారిక ప్రకటనరావాల్సి ఉంది, అమితాబ్ ఇదివరకు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్రలో నటించగా.. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్-K’ లో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.
‘విక్రమ్’ సినిమాను జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇటివలే విడుదల చేసిన మేకింగ్ వీడియోలో తెలిపారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read also:
Vikramarkudu | ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌కు నో చెప్పిన రాజమౌళి?
K.G.F Chapter-2 | కేజీఎఫ్ నుంచి బిగ్ అప్డేట్.. హోస్ట్‌గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
Rana Daggubati | ‘విరాట పర్వం’ విడుదలపై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?