Rangasthalam | నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’.. ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే?
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. చరణ్ కెరీర్లో 100కోట్ల షేర్ అందుకున్న మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం బుధవారంతో నాలుగేళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
Rangasthalam Final Collections | మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు చరణ్ నటనను విమర్శించనవారే ఈ చిత్రంలో చరణ్ నటనకు జేజేలు కొట్టారు. చరణ్ నటనతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేశాడు. చరణ్ కెరీర్లో 100కోట్ల షేర్ అందుకున్న మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం చరణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. సుకుమార్ టేకింగ్, విజన్‌కు సినీప్రముఖుల సైతం ఫిదా అయిపోయారు. నటీనటుల పర్ఫార్మెన్స్, సాంకేతిక బృందం పనితీరు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం బుధవారంతో నాలుగేళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
నైజాం : 27.60 కోట్లు
సీడెడ్ : 17.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 13.25 కోట్లు
ఈస్ట్ : 8.20 కోట్లు
వెస్ట్ : 6.35 కోట్లు
గుంటూరు : 8.50 కోట్లు
కృష్ణ : 7.17 కోట్లు
నెల్లూరు : 3.48 కోట్లు
ఏపీ+తెలంగాణ : 91.95 కోట్లు
ఓవర్సీస్ : 13.72 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 7.60 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ : 122.47 కోట్లు
‘రంగస్థలం’ చిత్రానికి రూ.80.36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 82 కోట్లతో బ్రేక్ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా 122.47 కోట్ల కలెక్షన్లను సాధించి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లకు రూ.40 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఇక ఈ చిత్రంతో రామ్‌చరణ్ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2మిలియన్, 3మిలియన్ మార్కును అందుకున్నాడు. ఫైనల్‌గా ఈ చిత్రం రూ.216 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తారక్ మరో ప్రధాన పాత్రలో నటించాడు.
Read Also:
RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
Adipurush | ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడేనట?
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Rashmika Mandanna | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. రష్మిక మందన్న?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

