Adipurush | ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడేనట?
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరక లేకుండా గడుపుతున్నాడు. ఈయన నటించిన 'రాధేశ్యామ్' ఇటీవలే విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి
Prabhas Adipurush First Look | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరక లేకుండా గడుపుతున్నాడు. ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. మొదటి రోజు నుంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక టాలీవుడ్లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. ఇదిలా ఉంటే ఈయన నటించిన ‘ఆదిపురుష్’ ఇదివరకే షూటింగ్ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓంరౌత్ రామాయణం నేపథ్యంలో రూపొందించాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించిగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారని టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’తో పాటు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉన్నాడు.
Read Also:
RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Stand Up Rahul | ఓటీటీలోకి ‘స్టాండప్ రాహుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rashmika Mandanna | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. రష్మిక మందన్న?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kritisanon
- omrout
- Prabhas
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

