Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లేటెస్ట్గా ఈయన 'ఈటీ:ఎవ్వడికి తలవంచడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్దమైంది.
Surya ‘ET’ On OTT | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘గజిని’ సినిమాతోనే తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. లేటెస్ట్గా ఈయన ‘ఈటీ:ఎవ్వడికి తలవంచడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి రెండు వరస ఓటీటీ సినిమాల తర్వాత థియేటర్లలో ఈటీ సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో 4కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫైనల్‌గా 3.10 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి ఎబో యావరేజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్దమైంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘నెట్‌ఫ్లిక్స్’, ‘సన్ఎన్ఎక్స్టి’లలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది.
Read Also:
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Rangasthalam | నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’.. ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

