Tiger Nageswara Rao | రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి బిగ్ అప్డేట్.. ప్రీ లుక్ వచ్చేది అప్పుడేనట?
మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేయాలనే ప్లాన్‌లో వరుసగా కథలను వింటూ నచ్చిన వాటిని ఓకే చేస్తున్నాడట.
Raviteja Tiger Nageswara Rao | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేయాలనే ప్లాన్‌లో వరుసగా కథలను వింటూ నచ్చిన వాటిని ఓకే చేస్తున్నాడట. ఇటీవలే రవితేజ ‘ఖిలాడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ‘రామారావు’ షూటింగ్ పూర్తీ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. జూన్ 17న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ‘రావణాసుర’, ‘ధమాకా’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను చేయనున్నాడు. నాలుగు నెలల ముందు ఈ చిత్రాన్ని టైటిల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ముహుర్తపు వేడుకను జరుపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా అప్పుడే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఈ చిత్రం ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుంది అనడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అయితే ఇదే కథతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ‘స్టూవర్డ్ పురం దొంగ’ అనే పేరుతో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ అప్పటినుంచి నేటి వరకు ఈ చిత్రం నుంచి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే గత కొన్ని నెలల ముందు ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్ బెల్లంకొండ సురేష్ బాబుతో చర్చలు జరిపారని, బెల్లంకొండ సురేష్ కూడా ‘స్టూవర్ట్ పురం దొంగ’ ప్రాజెక్ట్‌ను విరమించుకున్నాడని టాక్ వచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
#tigernageswarrao on its way … #RaviTeja @RaviTeja_offl @AbhishekOfficl @DirVamsee mayanksinghanya #RaviTeja pic.twitter.com/freiumG0Ww
— G.V.Prakash Kumar (@gvprakash) March 31, 2022
Read Also:
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Rangasthalam | నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’.. ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే?
RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

