త్వరలో టోల్ రద్దీకి చెక్!
హైదరాబాద్ చుట్టుపకల జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ క్యూ కష్టాలకు త్వరలోనే తెరపడనున్నది.
- అందుబాటులోకి నూతన సాంకేతికత
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టుపకల జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ క్యూ కష్టాలకు త్వరలోనే తెరపడనున్నది. నగరానికి నలువైపులా ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ వసూలు చేసే బారియర్ లేస్ టోలింగ్ (మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో-ఎంఎల్ఎఫ్ఎఫ్) సాంకేతికతను దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్హెచ్ఏఐ సన్నాహాలు చేస్తున్నది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు టోల్ ప్లాజాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని కీలక మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. రహదారిపై ఏర్పాటు చేసే ఓవర్ హెడ్ గాంట్రీల వద్ద ఆర్ఎఫ్ఐడీ రీడర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఉంటాయి. రహదారిపై వాహనాలు వెళ్తున్నప్పుడు ఈ పరికరాలు ఫాస్టాగ్, నంబర్ ప్లేట్‌ను గుర్తించి టోల్ రుసుమును ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

