Ajith Kumar | మధురై విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో అజిత్ నెక్స్ట్ చిత్రం?
తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గొల్లపూడి మారుతిరావు దర్శకత్వం వహించిన 'ప్రేమ పుస్తకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్ వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.
Ajith Kumar | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గొల్లపూడి మారుతిరావు దర్శకత్వం వహించిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్ వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అజిత్ ఇటీవలే ‘వలిమై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోటీగా ‘భీమ్లానాయక్’ వంటి పెద్ద సినిమా ఉన్న మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ఈవెన్కు కాస్త దూరంలో ఆగిపోయి తెలుగులో ఎబో యావరేజ్‌గా నిలిచింది. పోటీగా పవన్‌కళ్యాణ్ సినిమా ఉన్నా ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టిందంటే విశేషం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన వలిమై దర్శకుడితోనే తన 61వ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
దీనితో పాటుగా అజిత్ తన 62వ సినిమాకు సంబంధించిన లాంఛనింగ్ కార్యక్రామాలు ఇటీవలే చెన్నైలో జరిగాయి. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే తాజాగా అజిత్ మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ‘8 తొటక్కల్’ వంటి క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన శ్రీ గణేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఈ చిత్రం మధురైలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Also:
K.G.F Chapter-2 | సమరానికి సిద్ధమైన ‘కేజీఎఫ్ చాప్టర్-2’.. రన్ టైం ఎంతంటే?
Shirya Saran | ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలు అని తెలియదు :శ్రియాశరణ్
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

