K.G.F Chapter-2 | సమరానికి సిద్ధమైన ‘కేజీఎఫ్ చాప్టర్-2’.. రన్ టైం ఎంతంటే?
'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా 'కేజీఎఫ్'. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. తెలుగు, తమిళం అని తేడా లేకుండా ప్రతి భాషలో
K.G.F Chapter-2 | ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా ‘కేజీఎఫ్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. తెలుగు, తమిళం అని తేడా లేకుండా ప్రతి భాషలో కన్నడ స్థాయి వసూళ్ళను సాధించింది. అప్పటివరకు ఒక హీరోకు అలాంటి ఎలివేషన్లు ఏ సినిమాలో లేవు. ప్రశాంత్‌నీల్ టేకింగ్‌కు, విజన్‌కు సినీప్రముఖులు సైతం జేజేలు కొట్టారు. యష్ నటన, అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంతో యష్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కేజీఎఫ్ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.
ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్ 14న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఒక్కరోజులోనే 109 మిలియన్ల వ్యూస్‌ను సాధించి మోస్ట్ ఫాస్టెస్ట్ వ్యూవుడ్ ట్రైలర్‌గా రికార్డు సృష్టించించి. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాల 6 సెకన్లు ఉంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రవిబసూర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ‘తుఫాన్’ సాంగ్ యూట్యూబ్‌లో తుఫాన్‌లా వ్యూస్‌ను సాధిస్తుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Also:
Shirya Saran | ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలు అని తెలియదు :శ్రియాశరణ్
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

