Matka | టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమాలు దాదాపు అన్ని భాషల్లో ఒకే టైటిల్‌తో వస్తుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం వివిధ భాషల్లో టైటిల్స్ మార్చి రిలీజవుతుంటాయి. రీసెంట్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజయింది.
ఇప్పుడిదే లైన్లో వరుణ్ తేజ్ నటిస్తోన్న మట్కా (Matka) కూడా చేరిపోనుందన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కరుణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న పాన్ ఇండియ స్థాయిలో విడుదలవుతుంది. కాగా హిందీ వెర్షన్ మట్కా వాసు టైటిల్‌తో విడుదల కానుందట. మేకర్స్ ఇలా హిందీ వెర్షన్‌కు పేరు మార్చడం వెనకున్న సీక్రెట్ ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి నానిలాగే వరుణ్ తేజ్హి ట్టును ఖాతాలో వేసుకుంటాడా..? అనేది ఆసక్తి నెలకొంది.
మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బొమ్మాళి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!