నాగర్ కర్నూల్ : కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Srinivas Yadav ) డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూల్ కేంద్రంలో కుమ్మెర బాధితుల ( Kummera Victims ) పక్షాన చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులలో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని , అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొనసాగుతున్న వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు కొనసాగడం బాధాకరమని అన్నారు.దేవుడిని దర్శించుకునే అర్హత బలహీన వర్గాలకు లేదా ? అని ప్రశ్నించారు. కుమ్మెర దోషులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.