టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ ( Varun Sandesh ) నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఇందువదన
( Induvadana). ఎమ్మెస్సార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని మాధవి అదుర్తి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదలైంది. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ తో టీజర్ మొదలైంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ టైమ్ లైన్ లో సినిమా సాగనుందని టీజర్ తో తెలుస్తోండగా..లవ్ ట్రాక్ లో వరుణ్, ఫర్నాజ్ శెట్టి (Farnaz Shetty) ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేదానిపై టీజర్ లో సస్పెన్స్ గా ఉంచాడు దర్శకుడు.
మరోవైపు టీజర్ చివరలో హీరోయిన్ ఫర్నాజ్ హార్రర్ యాంగిల్ లో కనిపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత ఇందువదన సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందువదన చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించని పీరియాడిక్ లుక్ లో సరికొత్తగా మెరుస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఇందువదన రొమాంటిక్ లుక్ పోస్టర్ మంచి స్పందన వచ్చింది. విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో