Siva Koratala | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్రోల్లో నటించిన ప్రాజెక్ట్ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన దేవర రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ విజయవంతంగా స్క్రీనింగ్ అవుతోంది దేవర.
చిట్ చాట్‌లో కొరటాల చెప్పిన విషయాలు సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కథ చాలా పెద్దగా ఉంది. దేవర 1 కేవలం బిగినింగ్ మాత్రమే. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చాలా పాత్రలు స్కోప్ తీసుకుంటాయి. వర అనేవాడు ఎలా ఉంటాడో మిగిలిన పాత్రలకు తెలియదు. ఆ ట్రామా అద్భుతంగా ఉంటుంది. సీక్వెల్లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుంది. పార్ట్ 2లో వర వీర విహారం ఉండబోతుందన్నాడు కొరటాల శివ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ.. సీక్వెల్‌పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
కథను ఒక సినిమాలో చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని ఈ సందర్భంగా కొరటాల అన్నాడు. దేవరలో వచ్చే కాంప్లెక్స్ క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయి. సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించాం. మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నలించాడు. సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Ratan Tata | మన దేశం కోసం పుట్టినందుకు ధన్యవాదాలు సార్.. రతన్ టాటాకు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
Vettaiyan Twitter Review | జై భీమ్ డైరెక్టర్ మార్క్ చూపించాడా..? తలైవా వెట్టైయాన్ ఎలా ఉందంటే..?
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!