Vettaiyan Twitter Review | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న జైభీమ్ లాంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహించడం.. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్‌లో వస్తుందంటే సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే.
వెట్టైయాన్‌లో దుషారా విజయన్, రితికా సింగ్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఫైనల్‌గా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది వెట్టైయాన్.. ది హంటర్ (Vettaiyan) .
మరి జై భీమ్ డైరెక్టర్ మరోసారి తన మార్క్ చూపించాడా..? తలైవా అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై నెటిజన్లు ఏ మంటున్నారో ఓ లుక్కేస్తే..
నెటిజన్లు ఏమంటున్నారంటే..?
#Vettaiyan
Am expecting a powerful screenplay like #Jaibhim and how #TJGnanavel used our #Superstar
Rockstar #AnirudhRavichander Music and BGM #FaFa #RanaDaggubati and #AmitabhBachchan Powerful Role❤️🔥#VettaiyanTheHunter#Rajinikanth𓃵 #ManjuWarrier #FahadhFaasil #AmithabBachan pic.twitter.com/cBrRd8ibWR— NEERAJ MAURYA (@NMaurya51669) October 9, 2024
జై భీమ్ లాంటి పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో జ్ఞానవేళ్ రాజా రజినీకాంత్‌ను పర్ఫెక్ట్గా చూపించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బీజీఎం అదిరిపోయింది. రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ రోల్లో కనిపించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మంజు వారియర్ క్లైమాక్స్ ఎపిసోడ్ థియేటర్లంతా చప్పట్ల మోతతో మార్మోగిపోయేలా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్: డైరెక్టర్ సినిమా, సెకండాఫ్ తలైవా సినిమా. దుషారా విజయన్ ఎప్పటిలాగే సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. ఫహద్ ఫాసిల్ పాత్ర ప్రేక్షకులకు రిలాక్సింగ్ ఫీల్ కలిగించేలా సాగుతుంది. మంజువారియర్ మాస్ సీన్లు, బిగ్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్మఫార్మెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
వెట్టైయాన్ రెగ్యులర్ మసాలా సినిమా కాదు.. నీట్, విద్యాసంస్థల మోసాల వంటి బలమైన కథాంశంతో తెరకెక్కిన మంచి సినిమా. జ్ఞానవేళ్ ఓ వైపు అభిమానులను సంతృప్తి పరుస్తూనే.. మరోవైపు సాధారణ ప్రేక్షకులకు సినిమాను కనెక్ట్ చేసి పర్ఫెక్ట్ విన్నర్‌గా నిలిచాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ప్రతీ ప్లాట్ ఫాం నుంచి డిజాస్టర్ రివ్యూస్ వస్తున్నాయి. పెద్దన్న తర్వాత రజినీకాంత్ ఖాతాలో మరో చెత్త సినిమా పడ్డదని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
టిపికల్ మసాలా కంటెంట్ కాకుండా.. సామాజిక సమస్యలను లేవనెత్తిన అద్భుతమైన చిత్రం. NEET, మోసపూరిత విద్యాసంస్థలకు వ్యతిరేకంగా బలైమన కంటెంట్‌తో సినిమా తీశారు. దర్శకుడి మేకింగ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు మెచ్చేలా ఉందని ఓ యూజర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
NEET, మోసపూరిత విద్యాసంస్థలకు వ్యతిరేకంగా బలమైన కంటెంట్‌తో సినిమా తీశారు. దర్శకుడి మేకింగ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు మెచ్చేలా ఉంది అని మరో యూజర్ ట్వీట్ పెట్టాడు.
#Vettaiyan is a 100% #Rajini film with #TJGnanavel’s sensibilities! It is filled with high moments to entertain the audience but doesn’t deviate away from the main theme! #FahadhFaasil and #Amitabh sir are tailor made for these roles. #Anirudh killed it! #ABCDRating: 4.5/5
— American Born Cinematic Desi (@that__abcd) October 10, 2024
వెట్టైయాన్ 100 శాతం టీజే జ్ఞానవేల్ సున్నిత అంశాలతో కూడిన తలైవా చిత్రం. ఇది ప్రేక్షకులను అలరించేందుకు అత్యున్నత అంశాలతో సాగుతుంది. ఫహద్ఫాసిల్, అమితాబ్ సార్ తమ పాత్రలకు తగ్గట్టుగా జీవించేశారు. ఎప్పటిలాగే అనిరుధ్ తన బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో చంపేశాడు.
1st half – Director movie
2nd half Thalivar movieRest all the characters done their best @SrBachchan– top notch @officialdushara – Superb acting#manjuwarrier– Mass scene@srkathiir – excellentDop @ritika_offl – Serious #FahadhFaasil – Hilarious
— Kannan (@erodekanna) October 10, 2024
#Vettaiyan #VettaiyanFrom10thOctober
Very Good movie! Need of the hour. Not a regular masala, but a strong content movie against NEET and cheating Education academies. Director @tjgnan is the clear winner! Satisfy both fans and general audience! #ThalaivarNirandharam pic.twitter.com/czhJxSP4Wa— Mithun (@Mithun_MDU) October 10, 2024
Hearing disaster reviews from every corner, after Annathe, this is easily the worst movie for Rajinikanth.#Vettaiyan #VettaiyanDiaster #VettaiyanFrom10thOctober pic.twitter.com/dOgQrRKtTZ
— Jagadesh (@jagadesh_jb) October 10, 2024
#Vettaiyan #VettaiyanFrom10thOctober
An excellent film that addresses pressing societal issues. It’s not your typical masala movie;
instead, it presents a compelling narrative against NEET and fraudulent educational institutions.
Director @tjgnan truly shines in this… pic.twitter.com/Sy8H9kT2NV
— Chinna Chinna Asai (@chennaitodaynew) October 10, 2024
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!