Dil Raju | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). టీజే జ్ఞానవేళ్ రాజా ( TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టైటిల్‌పై జరుగుతున్న చర్చపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. టైటిల్ గురించి బాగా డిస్కషన్ జరుగుతుందని మీడియాతో మాట్లాడాలనుకున్నా. తెలుగులో వేటగాడు టైటిల్ పెడతామని తెలుగు ఫిలిం చాంబర్‌కు లేఖ రాశారు. ఆ టైటిల్ వేరే వాళ్లకుండటం వల్ల దొరకలేదు.
తమిళనాడులో ఒకప్పుడు తమిళ్ టైటిలే ఉండాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ రూల్ పెట్టుకుంది. తర్వాత తర్వాత మారుతూ మారుతూ.. ఆ రాష్ట్రంలో ఇంగ్లీష్ టైటిల్స్‌తోపాటు ఏ టైటిల్స్ అయినా అంగీరిస్తున్నారు. మేకర్స్ అనుకున్న టైటిల్ వెట్టైయాన్.. ది హంటర్. వెట్టైయాన్ తెలుగుకు అనువాదం చేయగలిగేంత టైటిల్ దొరకలేదు. తమిళ్ టైటిల్‌తో తెలుగులో రిలీజవుతుందని సోషల్ మీడియాలో చాలా మంది అనుకుంటున్నారు. ఇవాళ సినిమా గ్లోబల్ వైడ్ అయింది. అందువల్ల వేరే ప్రాంతంలో విడుదల చేసినప్పుడు దొరికితే టైటిల్‌ను మార్చుకుంటున్నారు.. లేదంటే ఒకే టైటిల్‌పై విడుదల చేస్తున్నారు.
టైటిల్‌ను ఇలా కావాలనే పెడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సినిమా సినిమాలాగే చూడండి. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. బాగా లేదంటే తెలుగు టైటిల్ పెట్టినా.. ఏ టైటిల్ పెట్టానా తిరస్కరిస్తారు. అంతేకాని తమిళ టైటిల్‌ను కావాలని మనపై రుద్దుతున్నారనుకుంటున్నారు. ఇది వాళ్ల ఇంటెన్షన్ కాదు.. దీనిపై లైకా ప్రొడక్షన్స్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసింది. జైభీమ్ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలై గ్రాండ్‌గా ప్రశంసలందుకుంది. జైభీమ్ డైరెక్టర్ జ్ఞానవేళ్ రాజా ఈ సినిమా కూడా అద్బుతంగా చేశాడని రివ్యూస్ వస్తున్నాయన్నారు దిల్ రాజు.
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!