Dil Raju | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
భాషల వారిగా సినిమా టైటిల్స్ విషయంలో నెట్టింట జరుగుతున్న చర్చ గురించి మాట్లాడారు పాపులర్ నిర్మాత దిల్ రాజు. రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పినప్పుడు.. తాము అన్ని భాషల్లో టైటిల్ గురించి వెతికాం. కానీ ఒక్క భాషలో టైటిల్ రైట్స్ రాలేదు. అక్కడి నిర్మాతలతో చర్చలు జరిపి ఫైనల్‌గా రైట్స్ దక్కించుకున్నాం.
అన్ని భాషల రైట్స్‌ను సొంతం చేసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటించాం. పాన్ ఇండియా సినిమాల్లో ఉన్న సమస్య ఇదే. వేర్వేరు భాషలకు వేర్వేరు టైటిల్ ఉండకూడదు. ఎందుకంటే సేమ్ టైటిల్‌ను మరో పరిశ్రమకు చెందిన వారు రిజిస్టర్ చేసుకుంటే రైట్స్ దక్కించుకోవడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సందడి చేయనున్న గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడట.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!