Trivikram srinivas | నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను (Telugu states) ముంచెత్తిన విషయం తెలిసిందే. వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు సెలబ్రిటీలు తమ వంతుగా వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ సంయుక్తంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు.
భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలిచివేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతుగా సాయంగా చేయూతనందిస్తున్నామని ప్రకటనలో తెలిపారు.
Considering the devastation unleashed by a massive downpour on two Telugu States, Director Trivikram Srinivas garu, Producers S. Radha Krishna (Chinababu) garu and S. Naga Vamsi have decided to donate Rs. 50 Lakhs – Rs. 25 lakhs each to Telangana and Andhra Pradesh states to… pic.twitter.com/KuEWhkVtJk
— Haarika & Hassine Creations (@haarikahassine) September 3, 2024
Prasanth Varma | హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సస్పెన్స్.. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో ..?
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్