నల్లగొండ, జనవరి 09 : గత రెండు రోజులుగా నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్య హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర బిజెపి నాయకుడు బండారు ప్రసాద్, ట్రస్మా స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్, కో కన్వీనర్ ముక్కామల రామ్మోహన్ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పాఠశాలలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందుతుందన్నారు. ఆటల వల్ల విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఎన్నో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నిర్వాహకులు ఎన్.రమేశ్‌రెడ్డి, అలుగుబెల్లి శ్యాంసుందర్ రెడ్డి, ఫయాజ్, యాదయ్య, చర్లపల్లి గణేష్, నాగేందర్, జానయ్య, మనోజ్, కళ్యాణ్, బిజు జోసెఫ్, జానారెడ్డి పాల్గొన్నారు.