MIW vs RCBW నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆదిలోనే కష్టాల్లో పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఓపెనర్ జి.కమలిని(32), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(18 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించి స్కోర్ 50 దాటించారు. శ్రేయాంక పాటిల్ ఓవర్లో హర్మన్‌ప్రీత్ భారీ సిక్సర్ బాదగా స్కోర్ 60కి చేరింది. 10 ఓవర్లకు స్కోర్..63-3.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను లారెన్ బెల్ మెయిడెన్ చేసింది. దాంతో మొదట ఓపెనర్ అమేలియా కేర్(4)ను బెల్ షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించింది. కాసేపటికే డీక్లెర్క్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ వచ్చిన నాట్ సీవర్ బ్రంట్(4)ను రీచా ఘోష్ రెప్పపాటులో స్టంపౌట్ చేసింది. దాంతో.. 35 పరుగులకే ముంబై రెండు ప్రధాన వికెట్లు పడ్డాయి.
The first wicket of #TATAWPL 2026! 😎
Lauren Bell gets her reward ⚡️
Mumbai Indians lose Amelia Kerr’s wicket
Updates ▶️ https://t.co/IWU1URl1fr#KhelEmotionKa | #MIvRCB | @RCBTweets pic.twitter.com/o3mgkZZ34B
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
అయినా ఒత్తిడికి లోనవ్వని ఓపెనర్ కమలిని(32) ఆర్సీబీ బౌలర్ల లయను దెబ్బతీస్తూ బౌండరీలతో చెలరేగింది. బెల్, డీక్లెర్క్ ఓవర్లో తను ఫోర్లతో స్కోర్‌బోర్డును ఉరికించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(18 నాటౌట్) కాస్త కుదురుకున్నాక శ్రేయాంక ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి స్కోర్ 60 దాటించింది. కానీ, అదే ఓవర్లో కమలిని స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డయ్యింది. ఫలితంగా 63 వద్ద ముంబై మూడో వికెట్ పడింది.