Devara | గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక వార్త అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
సినిమా విడుదలకు ఇంకా 25 రోజులుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతున్న దేవర సినిమా ప్రీ సేల్స్ నేడు కెనడాలో 25 స్క్రీన్లలో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ప్రీ సేల్స్ మొదలైన 6 నిమిషాల్లోనే గ్రేటర్ టొరంటో ఏరియాలోని లీడింగ్ మల్లీప్లెక్స్ చైన్ మార్కెట్లో ఉన్న యార్క్ సినిమాస్, వుడ్‌సైడ్ స్వ్వేర్ సినిమాస్, అల్బియాన్ సినిమాస్, సెంట్రల్ పార్క్‌వే సినిమాస్ స్క్రీన్లపై ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డ్సు్ దర్శనమిస్తున్నాయని సమాచారం. తారక్ దేవర సినిమాకు వరల్డ్ వైడ్‌గా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ క్క విషయం చాలు.
దేవర టీం ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దేవర నుంచి విడుదల చేసిన ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు తారక్-జాన్వీకపూర్ మధ్య వచ్చే డ్యుయెట్ దేవర థర్డ్ సింగిల్ దావుడి (Daavudi) కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు తెలియజేశాడు అనిరుధ్ రవిచందర్.
రీసెంట్గా భయం ముఖ చిత్రాలు.. అంటూ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తున్న తారక్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవరలో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ