Viswam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand) నటిస్తోన్న చిత్రం విశ్వం (Viswam). శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో Gopichand 32గా వస్తోంది. కొన్ని రోజుల క్రితం జర్నీ ఆఫ్ విశ్వం వీడియోను షేర్ చేయగా.. ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు చెప్పకనే చెబుతోంది. మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను టీజర్ రూపంలో అందించింది శ్రీను వైట్ల టీం.
విశ్వం టీజర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ స్టైలిష్ లుక్ షేర్ చేశారు. ఇప్పుడీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తు్న్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అంటూ ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ సారి గోపీచంద్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇది. ఇక ఫస్ట్ స్ట్రైక్‌లో తెగిపడటం.. తెగించగలడం క్రమాన ఫలితం.. విధాత విశ్వం అంటూ సాగే టైటిల్ ట్రాక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
The entertaining #Viswam awaits 💥💥#ViswamTeaser out on 3rd September at 4.05 PM ❤️🔥
Macho star @YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi @ChitralayamS @vivekkuchibotla #KrithiPrasad @kondaljinna @Gopimohan @kvguhan @chaitanmusic… pic.twitter.com/kO35LGVKV8
— People Media Factory (@peoplemediafcy) September 2, 2024
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Coolie Movie | కలీసా వచ్చేశాడు.. ‘కూలీ’లో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర
Jr NTR – Kantara Prequel | ‘కాంతార’ ప్రీక్వెల్‌లో నటిస్తున్నారా.? ఎన్టీఆర్ ఏమన్నాడంటే.!