Kantara Prequel – Jr NTR | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మంగళూరు వెళ్లిన తారక్.. అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. శనివారం నాడు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న తారక్ ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. కాంతార నటుడు రిషబ్ శెట్టితో కలిసి ఉదయం పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన తారక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అయితే దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తూ మీడియాతో ముచ్చటించారు తారక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిషబ్ శెట్టితో కలిసి శ్రీకృష్ణ మఠం, మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ఇటువంటి దివ్యమైన ప్రదేశంలో సినిమాల అప్డేట్ల గురించి స్పందించాలని లేదు అంటూ వెల్లడించాడు. అయితే ఒక రిపోర్టర్ అడుగుతూ.. కాంతార ప్రీక్వెల్లో మీరు నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఎంత అని అడుగగా.. తారక్ చెబుతూ.. రిషబ్ షెట్టి అలాంటివి ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా అంటూ తారక్ చెప్పుకోచ్చాడు.
Anna @tarak9999 & @shetty_rishab ‘s family visited 𝗸𝗼𝗹𝗹𝘂𝗿𝘂 𝘀𝗿𝗶 𝗺𝗼𝗼𝗸𝗮𝗺𝗯𝗶𝗸𝗮 𝘁𝗲𝗺𝗽𝗹𝗲 today
Adopted Son Of Karnataka 🧎♂️🧎♂️ pic.twitter.com/DKjALcRcls
— …. (@NTRHolicc_) September 1, 2024