Hollywood Movie | అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘మన్మథుడు’ సినిమా ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజీ మూవీగానే ఉంటుంది. 2003లో విడుదలైన ఈ లవ్ స్టోరి చిత్రం, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ, నాగార్జున కెరీర్లో ఒక క్లాసిక్‌గా నిలిచింది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్రివిక్రమ్ అందించిన కథ, డైలాగ్స్ కారణంగా కూడా ప్రేక్షకుల మధ్య విశేష గుర్తింపు పొందింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాలి బింద్రే మరియు అషు అంబానీ నటించారు. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అషు, ఈ చిత్రంతో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి అడుగుపెట్టింది.
అయితే, అషు ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాలో కనిపించింది. రెండు సినిమాలలోను హీరోయిన్ పాత్రలు చనిపోవడం, అలాగే వరుసగా అలాంటి పాత్రలు రావడం వల్ల 15 ఏళ్లపాటు సినీ రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇటీవలే మజాకా సినిమాతో ఆమె రీ-ఎంట్రీ ఇచ్చి, అభిమానుల హృదయాలను గెలుచుకుంది. సినిమాల నుండి విరామం తీసుకున్న తర్వాత, అషు లండన్ వెళ్లి సచిన్ సగ్గార్తోని వివాహం చేసుకుంది. వీరికి బాబు మరియు పాప ఉన్నారు. ప్రస్తుతానికి, అషు లండన్‌లో ‘ఇన్స్పిరేషన్ కౌచర్’ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తోంది.
మజాకా సినిమా ప్రమోషన్స్‌లో తన కూతురితో ఆమె సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, నెటిజన్స్ అన్షు కూతురిని చూసి ఎప్పుడు సినిమాలలోకి వస్తుందా అని ఆలోచనలు చేశారు. అయితే తాజాగా తన అన్షు తన ఇన్‌స్టాలో తన కూతురు హాలీవుడ్ చిత్రంతో ఆరంగేట్రం చేస్తుందని చెప్పుకొచ్చింది. నా కూతురు తొలిసారి సెట్లోకి అడుగుపెట్టిందని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇన్నాళ్లు నాపై చూపించిన ప్రేమ, అభిమానం నా కూతురు షనయాపై కూడా చూపించండి అని పేర్కొంది.ఈ సినిమాని లేడీ డైరెక్టర్ అలీనా ఇలిన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అన్షు పోస్ట్‌కి చాలా మంది కంగ్రాట్స్ అని కామెంట్స్ పెడుతున్నారు.