Billa Ranga Baasha | హనుమాన్ సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ (Prime show Entertainment). ఈ బ్యానర్ కింగ్ టేకోవర్ చేసే సమయం.. ఎక్జయిటింగ్ పాన్ ఇండియా సినిమా కోసం బ్లాక్ బస్టర్ కాంబో రాబోతుంది. కింగ్ సైజ్ ప్రకటన ఉండబోతుందని ప్రకటించినట్టుగానే.. ఆ సస్పెన్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది.
ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్తో బిల్లా రంగా భాషా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. విక్రాంత్ రోన డైరెక్టర్ అనూప్ భండారి డైరెక్షన్లో తాజా చిత్రం చేస్తున్నాడు. బాద్ షా కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్బంగా టైటిల్, కాన్సెప్ట్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఫస్ట్ బ్లడ్ అంటూ షేర్ చేసిన కాన్సెప్ట్ వీడియో చూస్తే.. సుదీప్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది టీం.
A Tale From The Future ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని తాజా విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది. బిల్లా రంగా భాషాలో కనిపించబోయే ఇతర నటీనటులు, సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
#BRBMovie Joining hands with @KicchaSudeep sir & The Makers of Hanuman @primeshowtweets, to bring to you ‘A Tale From The Future’. Unveiling the Official Title Logo and Concept video on Baadshah’s Birthday. #BillaRangaBaasha – First Blood @Niran_Reddy @chaitanyaniran… pic.twitter.com/4oZQEkMUA7
— Anup Bhandari (@anupsbhandari) September 2, 2024
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ