Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). విజయ్ (Thalapathy Vijay) లీడ్ రోల్లో నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వెంకట్ ప్రభు అండ్ విజయ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు ఆసక్తికర విషయం చెప్పాడు. తాను కరోనా సంక్షోభ సమయంలో ది గోట్ కథను సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్‌ను మైండ్‌లో పెట్టుకొని రాసుకున్నానన్నాడు. సినిమాలో వీరిద్దరినీ తండ్రీ కొడుకులుగా ఊహించుకున్నా. కానీ దురదృష్టవశాత్తు కార్యరూపం దాల్చలేదు. తర్వాత స్క్రిప్ట్‌లో కొన్ని మార్పు చేర్పులు చేశా. ఫైనల్‌గా ఆ రెండు పాత్రల్లో నటించేందుకు విజయ్ ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వెంకట్ ప్రభు ముందుగా అనుకున్న ప్రకారం తలైవా, ధనుష్‌తో సినిమా చేస్తే.. అది మాత్రం అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉండేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మనోబాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!