Prasanth Varma | హనుమాన్ సినిమాతో టాలీవుడ్‌కు పాన్ ఇండియా సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టందించాడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించాడని తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు నందమూరి మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్టు దాదాపు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ సెప్టెంబర్ 6న ఉండబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్ ఒకటి నెటిజన్లు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఓ ఫొటోను షేర్ చేస్తూ.. చాలెంజ్ స్వీకరించబడిందని ట్వీట్ చేశాడు. ఇంతకీ ప్రశాంత్ వర్మకు ఎవరు చాలెంజ్ విసిరారు. అసలు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ వెనుకున్న సీక్రెట్ ఏమై ఉంటుందా..? అని చర్చలో మునిగిపోయారు సినీ జనాలు. మరి ఈ పోస్ట్ మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించేనా.. లేదంటూ హనుమాన్ సీక్వెల్ కోసం ఇలా పెట్టి ఉంటాడా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి ప్రశాంత్ వర్మ దీనిపై ఏదైనా స్పష్టత ఇస్తాడేమో చూడాలి.
— Prasanth Varma (@PrasanthVarma) September 2, 2024
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!