T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ కోసం ఐర్లాండ్ (Ireland) బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ బరిలో నిలిచిన ఐర్లాండ్‌కు అనుభవజ్ఞుడైన పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) సారథిగా వ్యవహరించనున్నాడు. శుక్రవారం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. రెండేళ్ల క్రితం ఈ మెగా టోర్నీకి ఎంపికైన 12 మందిని ఈసారి కూడా కొనసాగించడం విశేషం.
ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. మెగా టోర్నీకి సమయం దగ్గరపడడంతో అర్హత సాధించిన అన్ని జట్ల బోర్డులు స్క్వాడ్లను ప్రకటిస్తున్నాయి. శుక్రవారం ఐర్లాండ్ క్రికెట్ సైతం తాము ఎంపిక చేసిన బృందంలోని 15 మంది పేర్లను వెల్లడించింది.
Ireland name their T20 World Cup 2026 squad, with the same team set to play the Italy and UAE series.
(T20 World Cup 2026, Ireland, Cricket, CricTracker) pic.twitter.com/OESjHzP3tY
— CricTracker (@Cricketracker) January 9, 2026
‘భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం మేము ఎంతో ఉత్సాహంగా ఎదురుచుస్తున్నాం. రెండేళ్ల క్రితం జరిగిన టోర్నీలో మేము మా అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. అప్పుడు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకూడదని భావిస్తున్నాం. గత 18 నెలల్లో స్క్వాడ్ ఎంపికపై భారీ కసరత్తు చేశాం. కాంబినేషన్లు మార్చి చూసి చివరకు పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశాం. గత సీజన్లో ఆడిన 12 మంది నిలకడగా రాణించారు కాబట్టి ఈసారి స్క్వాడ్‌లో ఉన్నారు. కొత్తవాళ్లు అంటే.. టిమ్ టెక్టర్, బెన్ కలిట్జ్, మాథ్యూ హంప్రెస్లు మాత్రమే’ అని ఐర్లాండ్ టీమ్ సెలెక్టర్ ఆండ్రూ వైట్ తెలిపాడు.
█▓▒▒░░░SQUAD REVEALED░░░▒▒▓█
The Irish squad heading to the @ICC Men’s @T20WorldCup has been named.
👉 Find all the details here: https://t.co/DpGprjhJkD#LoveCricket #BackingGreen #IrishCricket ☘️🏏 pic.twitter.com/HQ5X2motcQ
— Cricket Ireland (@cricketireland) January 9, 2026
ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కలిట్జ్, కర్టిస్ కాంఫర్, గరేత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంప్రెస్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లార్కాన్ టక్నర్(వైస్ కెప్టెన్), బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.
గ్రూప్ బీలో ఉన్న ఐర్లాండ్ ఆతిథ్య శ్రీలంక, ఒమన్, జింబాబ్వేతో లీగ్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి పోరులో ఫిబ్రవరి 8న కొలంబోలో లంకతో స్టిర్లింగ్ సేనత తలపడనుంది.