Bomb Threat | తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి త్రిష (Trisha) నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
చెన్నై ఆళ్వార్‌పేట్ (Alwarpet)లోని త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేనాంపేట పోలీసులు తెలిపారు. కాగా, త్రిష నివాసానికి ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
Also Read..
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Dude | వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ ..‘డ్యూడ్’ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి!
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..