Dude | కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోగా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, తాజాగా ‘డ్యూడ్ (Dude)’ సినిమాతో మరో బిగ్ హిట్ సాధించాడు. అక్టోబర్ 17న విడుదలైన డ్యూడ్ సినిమా థియేటర్స్‌లో ఘన విజయం సాధించింది. కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తన చక్కటి నటనతో ఆకట్టుకోగా, హీరోయిన్ మమితా బైజు తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
డ్యూడ్ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ₹100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అంతకు ముందు ప్రదీప్ నటించిన డ్రాగన్ చిత్రం తొలి రోజే ₹14 కోట్లు మాత్రమే వసూలు చేయగా, డ్యూడ్ మాత్రం మొదటి రోజు నుంచే ₹22 కోట్లకు పైగా రాబట్టి కలెక్షన్లలో దూసుకెళ్లింది. థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ఇప్పుడు డ్యూడ్ ఓటీటీకి సిద్ధమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన అనేక రూమర్లకు తెరదించుతూ, సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్యూడ్’ స్ట్రీమింగ్కు రానుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల పోస్టర్ కూడా విడుదలైంది, దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ,శరత్ కుమార్, రోహిణి, నేహా శెట్టి, హృదు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ నటన, కామెడీ టైమింగ్, కొత్త కథన శైలి, యూత్ కనెక్ట్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌గా మారాయి. థియేటర్లలో హిట్టయిన డ్యూడ్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మరింత రేంజ్ హిట్ అవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో “డ్యూడ్” స్ట్రీమింగ్ కానుండగా, సినిమా చూడకుంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.