Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Sigma | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతోనే తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Sigma | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతోనే తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. సినిమా టైటిల్‌ను ‘సిగ్మా (SIGMA)’ గా ఫిక్స్ చేశారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ బంగారం, నగదు కట్టలపై చేతికి కట్టు కట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న యాంగర్, ఇంటెన్సిటీ ఈ మూవీ టోన్‌ను స్పష్టంగా చెబుతోంది.
సందీప్ ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే భిన్నంగా, ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ అవతారంలో కనిపించనున్నారు. ఫ్యాన్స్ ఈ లుక్‌పై ఫిదా అవుతున్నారు. సమాచారం ప్రకారం, సిగ్మా ఒక ట్రెజర్ హంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ మూవీ విజువల్‌గా గ్రాండ్‌గా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమిళ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం మరింత స్పెషల్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, విజువల్స్ విషయంలో ఆయన చూపుతున్నప్రత్యేక దృష్టి సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తొలి సినిమానే పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేయడం ద్వారా ఆయన సీరియస్ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తున్నారు. ‘మైఖేల్’, ‘టెనెట్’ తరహాలో ఆ యాక్షన్-ఇంటెన్స్ జానర్లో సిగ్మా సినిమా సందీప్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతుందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయం. “When Greed Meets Guts!” అనే ట్యాగ్‌లైన్ పోస్టర్లో కనిపించడం సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. సందీప్ కిషన్ – జాసన్ సంజయ్ కాంబినేషన్లో వస్తున్న ‘సిగ్మా’ త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ట్రెజర్ హంట్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ మూవీ 2025లో టాలీవుడ్లో బిగ్ బ్లాస్టర్ అవ్వడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

