Bad Newz | బాలీవుడ్ యాక్టర్లు విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri), అమ్మి విర్క్ లీడ్ రోల్స్ పోషించిన చిత్రం బ్యాడ్ న్యూజ్ (Bad Newz). ఆనంద్ తివారి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జులై 19న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా బ్యాడ్న్యూజ్ను థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఇప్పటికే ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్యాడ్ న్యూజ్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
బ్యాడ్‌న్యూజ్ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఆగస్టు చివరి వరకు రెంటల్ బేసిస్‌లో వీక్షించే అవకాశం కల్పించగా.. ఈ మూవీని తాజాగా ఉచితంగా చూసే అవకాశం వచ్చేసింది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఇవాళ్టి నుంచి అమెజాన్‌లో ఉచితంగా చూసేయొచ్చన్నమాట. ఇంకేంటి మరి ఓటీటీ లవర్స్ బ్యాడ్న్యూజ్పై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి Tauba Tauba సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పాపులర్ సింగర్, ర్యాపర్ Karan Aujla, విక్కీ కౌశల్ కాంబోలో వచ్చిన ఈ పార్టీ యాంథెమ్‌ను మ్యూజిక్ అండ్ మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేహా ధూపియా కీలక పాత్రలో నటించింది.
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు