Bad Newz | విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ న్యూజ్ (Bad Newz). ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమ్మి విర్క్, నేహా ధూపియా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇక ఓటీటీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే రెంటల్ బేసిస్‌లో వీక్షించే అవకాశం కల్పించారు. మీరు Bad Newz రెంటల్ ఫ్రీగా చూడాలనుకుంటే రూ.349 చెల్లించాలి మరి. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లాంచ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంతోపాటు అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇక ఈ మూవీలో వచ్చే Tauba Tauba సాంగ్ నెట్టింట ఓ ఊపు ఊపేస్తుంది. పాపులర్ సింగర్, ర్యాపర్ Karan Aujla, విక్కీ కౌశల్ కాంబోలో వచ్చిన ఈ పార్టీ యాంథెమ్‌ను మ్యూజిక్ అండ్ మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Hindi film #BadNewz is now available on rent on Amazon Prime Video Store. pic.twitter.com/z6nJPzvDmT
— Streaming Updates (@OTTSandeep) August 29, 2024
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!